![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత గ్రాంఢ్ గా హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే దీనికి కారణం ఎవరు? కంటెస్టెంట్సా? హోస్ట్ నాగార్జున వల్లనా? వీటితో పాటు గ్రాంఢ్ పినాలే టీఆర్పీ ఎంత వచ్చిందని ఎందరో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ 7 మాత్రం నేషనల్ లెవల్‌లో తలెత్తుకునే రేటింగ్‌ని రాబట్టిందనే అందరికి తెలిసిన నిజం. డిసెంబర్ 17 ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ 21.7 TVR రేటింగ్ సాధించి సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది. ఈ సీజన్ మొదలైనరోజు నుండి ఉల్టా పుల్టా అంటు భారీ హైప్ క్రియేట్ చేసాడు హోస్ట్ నాగార్జున.
ఇక ఆరో సీజన్‌కి బిగ్ బాస్ హిస్టరీలోనే ది వరస్ట్ రేటింగ్‌లు రావడంతో.. ఫినాలే ఎపిసోడ్ రేటింగ్‌లను కూడా ప్రకటించలేదు. ఫినాలే వీక్‌లో అత్యల్పంగా 0.86 రేటింగ్ సాధించిందంటే.. ఆ సీజన్ ఎంత వరెస్ట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి వరకు ఏ భాషలోను ఇంత దారుణమైన రేటింగ్ నమోదు కాలేదు. వీకెండ్‌లో 3.62.. వీక్ డేస్‌లో సరాసరి 2.33గా రేటింగ్ వచ్చేది. సీరియల్స్ రేటింగ్ కంటే తక్కువ రావడంతో.. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే రేటింగ్స్‌ని ప్రకటించనేలేదు. ఈ బిగ్ బాస్ సీజన్-7 తాజా రేటింగ్స్ ప్రకారం.. 21.7 TVR రేటింగ్స్‌ని సాధించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సీజన్ 4కి సరిగ్గా 21.7 రేటింగ్ వచ్చింది. ఇప్పటివరకు ఇండియాలో జరిగిన ఏ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి రానంత వ్యూవర్ షిప్ అభిజిత్ విన్నర్ అయిన సీజన్-4కి వచ్చింది. మళ్ళీ అదే రేటింగ్ ఈ సీజన్-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాక వచ్చింది.
అసలు ఏలా ఇంత హిట్ అయిందంటే.. సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ లో అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి ఉన్నారు. యాక్టర్ శివాజీ, కామన్ మ్యాన్ క్యాటగిరీలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఇక వచ్చిన మొదటి వారంలోనే రైతుబిడ్డని టార్గెట్ చేసి సెలబ్రిటీ లిస్ట్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్ చేయడంతో.. ఆ హీటెడ్ ఆర్గుమెంట్స్ లో రైతులు వర్సెస్ బిటెక్ స్టూడెంట్స్ అనే ఇష్యూ బయటకు రావడంతో అది రెండు రాష్ట్రాలలో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. దానితో పాటు యాక్టర్ శివాజీ ఫెయిర్ అండ్ క్లీన్ గేమ్ స్ట్రాటజీ, యావర్ అటిట్యూడ్, రైతుబిడ్డ ప్రశాంత్ టాస్క్ లలో వందకి వంద శాతం కష్టం.. కార్తీక దీపం మోనిత నటవిశ్వరూపం, టేస్టీ తేజ కామెడీ, ఆట సందీప్ స్ట్రాటజీ, అమర్ దీప్ ఫౌల్ గేమ్స్ ఆడటం, రతిక లవ్ ట్రాక్, శుభశ్రీ రాయగురు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడం, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ కృష్ణ చెప్పడం, సీరియల్ బ్యాచ్ కి భోలే షావలి ఇచ్చిన మాస్ పంచ్ లు.. ఇలా చెప్పుకుంటు పోతే అన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఈ సీజన్ గ్రాంఢ్ గా హిట్ అయింది. అత్యధిక టీర్పీతో దూసుకెళ్లింది. ఇక ఈ సీజన్ టీఆర్పీని స్టార్ మా అఫీషియల్ సైట్ లో తెలిపారు.
![]() |
![]() |